కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ కగార్'ను వ్యతిరేకిస్తూ ఇవాళ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఇప్పటికే లేఖ విడుదల చేసింది. బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు బహిరంగంగా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. దీంతో ఇవాళ బంద్ వాతావరణం కొనసాగే అవకాశం కనిపించట్లేదు. స్కూళ్లు, కాలేజీలు యధాతథంగా నడవనున్నాయి. షాపులు కూడా తెరిచే ఉండనున్నాయి.