
ఉప్పాడలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు (వీడియో)
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో కాకినాడ సమీపం వద్ద ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు బీచ్ రోడ్డు మార్గాన్ని మూసివేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం రాత్రి తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.




