TG: మాజీ సీఎం కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై సవాల్ విసిరారు. శుక్రవారం సచివాలయం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో రూ. 8.21 లక్షల కోట్ల అప్పు ఉందని, ఇందులో గత ప్రభుత్వ బకాయిలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అప్పులకు అసలు, వడ్డీ కలిపి రూ. 2,08,061 కోట్లు కడుతూ, పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆరేనని,
కేటీఆర్, హరీష్ రావులు రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించి చూపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై
కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.