TG: బడ్జెట్ సమావేశాలు ఆదివారం కూడా కొనసాగనున్నాయి. ఇవాళ విద్యుత్ సంస్థల వార్షిక నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీకి సమర్పిస్తారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ మృతిపై సంతాపం తెలుపుతారు. అనంతరం వ్యాట్ సవరణ బిల్లును సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. హెట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ నిరోధక బిల్లును కూడా ప్రవేశపెడతారు. బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయింపుల పద్దులపై చర్చ జరగనుంది. అలాగే వైద్య, R&B, ఇరిగేషన్ పద్దులపై ఓటింగ్ జరగనుంది.