ప్రతి పేదోడికి భూభారతి చట్టం అండగా నిలుస్తుంది: మంత్రి (వీడియో)

59చూసినవారు
TG: ప్రతి పేదోడికి భూభారతి చట్టం అండగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. 'గతంలో ధరణి చట్టంలో దరఖాస్తు చేసుకోవాలంటే రూ.1,000 చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. అధికారులే రైతుల ఇంటికి వచ్చి దరఖాస్తులు నింపి, చట్టంపై అవగాహన కల్పిస్తారు. రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చాం' అని అన్నారు.
Job Suitcase

Jobs near you