సోషల్ మీడియా ప్రభావంపై నటి భూమికా చావ్లా వ్యాఖ్యలు

0చూసినవారు
సోషల్ మీడియా ప్రభావంపై నటి భూమికా చావ్లా వ్యాఖ్యలు
యువకుడు సినిమాతో వెండితెరపై మెరిసిన నటి భూమికా చావ్లా, తన రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో తెలుగుతో పాటు పలు భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హిందీ చిత్రం కేసర్‌ సింగ్‌లో నటిస్తున్న ఈ భామ, సోషల్ మీడియా ప్రభావంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం కేవలం పాపులారిటీ కాదని, అర్థవంతమైన కంటెంట్‌తో సానుకూల ప్రభావం చూపించకపోతే దాని వల్ల ప్రయోజనం లేదని ఆమె పేర్కొంది. యువతలో అభిప్రాయాలను రూపొందించే శక్తి సోషల్ మీడియాకు ఉందని, దాన్ని జాగ్రత్తగా వాడాలని భూమికా చావ్లా సూచించింది.

సంబంధిత పోస్ట్