సీఎం ఆదేశాలతో నలుగురు చిన్నారులకు సైకిళ్లు అందజేత

56చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులోని నలుగురు పిల్లలకు అధికారులు సైకిళ్లు అందజేశారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా సీఎం‌ను కలిసిన తల్లికి వందనం పథకం లబ్ధిదారు మాధవి, నరసింహులు దంపతుల పిల్లలు సైకిళ్లు కావాలని సీఎం‌ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు నలుగురికి సైకిళ్లు అందించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు వారి ఇంటికి వెళ్లి సైకిళ్లను పిల్లలకు అందజేశారు.

సంబంధిత పోస్ట్