రైతులకు బిగ్‌ అలర్ట్‌.. వారికి పీఎం కిసాన్‌ నిలిపివేత!

22చూసినవారు
రైతులకు బిగ్‌ అలర్ట్‌.. వారికి పీఎం కిసాన్‌ నిలిపివేత!
కేంద్ర ప్రభుత్వం PM-KISAN పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6,000 మూడు విడతల్లో రూ.2,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రస్తుతం 23వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే e-KYC పూర్తి చేయని వారు, ఆధార్–బ్యాంక్ ఖాతా లింక్ చేయని వారు, అలాగే వివరాల్లో లోపాలు ఉన్న రైతులకు గతంలోనే నిధులు నిలిపివేసినట్లు సమాచారం. దీంతో అర్హత ఉన్నా కొంతమందికి చెల్లింపులు ఆలస్యమయ్యాయి. ఈ 23వ విడత పొందాలంటే రైతులు తప్పనిసరిగా e-KYC పూర్తి చేసి, బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని, లేకపోతే వారికి నగదు జమ కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్