
పేపర్ అడ్డంపెట్టి బ్యాంకులో బంగారం కాజేసిన దొంగ (వీడియో)
ఏపీలోని తిరుమల రూరల్ అవిలాలలో ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో బంగారం చోరీ జరిగింది. టేబుల్‌పై ఉన్న బంగారాన్ని గమనించిన ఓ దుండగుడు.. పేపర్ అడ్డం పెట్టి సుమారు 60 గ్రాముల బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.




