TG: మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలంగా మంత్రి వర్గంలో మార్పుల పైన చర్చ జరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో పాటు మరో ఇద్దరికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కీలక మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ముగ్గురు మంత్రుల పనితీరు పట్ల అధిష్ఠానం అసంతృప్తిగా ఉందని.. అందులో ఇద్దరు మంత్రులను తప్పించవచ్చని టాక్.