కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. BRSలో భారీగా చేరికలు

26చూసినవారు
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. BRSలో భారీగా చేరికలు
TG: స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని ఇంద్రియాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి ధీరావత్ వెంకటేష్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ బండి కృష్ణ గౌడ్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్