TG: గణేశ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో తెలంగాణలో మద్యం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. వరంగల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు వైన్‌షాపులు, బార్లు, క్లబ్‌లు మూసివేయనున్నారు. నిజామాబాద్‌లో మంగళవారమే మద్యం దుకాణాలు బంద్ చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. సైబరాబాద్ పరిధిలో ఈ నెల 25 ఉదయం 6 నుంచి 26 ఉదయం 6 వరకు వైన్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్లు బంద్ ఉంటాయి. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఇచ్చారు.