కేంద్రం 30 రోజుల రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించడంతో టెలికం కంపెనీలు కొత్త మార్గాలు అనుసరిస్తున్నాయి. 28 రోజుల ప్లాన్‌ను 30 రోజులకు పెంచకుండా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఎయిర్‌టెల్‌లో రూ.349 రీఛార్జ్‌తో 28 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ లభించేది. తాజాగా అదే ప్రయోజనాలతో 30 రోజుల ప్లాన్‌ను రూ.379కి అందిస్తోంది. అంటే అదనంగా 2 రోజులకు రూ.30 చెల్లించాల్సి వస్తోంది. దీంతో కస్టమర్లపై భారం పడుతోంది.