
మళ్లీ ఉగ్రదాడులకు కుట్ర!.. ముగ్గురు అరెస్టు
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అధికారులు ఉగ్రదాడుల కుట్రను భగ్నం చేశారు. పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. గతేడాది నుంచి వాళ్లపై నిఘా ఉంచామని.. ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వాళ్లపై ఆరోపణలు ఉన్నాయని ఏటీఎస్ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




