
ఆలుగడ్డ ధర కేజీ రూ.లక్ష.. ఎక్కడో తెలుసా ?
భారతదేశంలో కేజీ రూ.25కే లభించే బంగాళాదుంపలు, ఆసియా దేశాల్లో రూ.380 నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతున్నాయి. ఫ్రాన్స్‌లోని ఇలే డీ నాయిర్మౌషియర్ దీవిలో మాత్రమే సాగు చేసే 'లా బొన్నొట్టే' అనే బంగాళాదుంప కేజీ ధర లక్ష రూపాయలు. ప్రత్యేకమైన ఇసుక నేలలో, సముద్రపు గడ్డిని ఎరువుగా వాడి, కేవలం 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సాగు చేసే ఈ దుంపలు మే, జూన్ నెలల్లో మాత్రమే మార్కెట్‌కు వస్తాయి. మూడు నెలల పంట కాలం, చేతులతోనే తీయడం, స్వల్పంగా ఉప్పు రుచి, వ్యాధుల నివారణలో ఉపయోగపడటం, అద్భుతమైన రుచి దీని ప్రత్యేకతలు.




