
పవన్ కాళ్ళ పై పడ్డ OG డిస్ట్రిబ్యూటర్
పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. హైదరాబాద్‌లో జరిగిన విజయోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్‌కు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తూగో జిల్లా డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ కాళ్లకు చెప్పులు లేకుండా స్టేజ్ పైకి వచ్చి పవన్ కాళ్లపై పడబోగా ఆయనను వారించి చెప్పులు వేసుకుని రావాలని చెప్పారు. అనంతరం చెప్పులు వేసుకొని వచ్చి మెమెంటో అందుకున్నారు.




