బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ సోమవారం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ తేదీలు, నామినేషన్ల సమయాలు, ఫలితాల ప్రకటన వంటి అంశాలను ప్రకటించారు. ఎన్నికల నగారా మోగడంతో బిహార్‌లో రాజకీయ వేడి చెలరేగింది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించాయి.