వివాదంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ (వీడియో)
బిహార్ సీఎం నితీశ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలో ఆయుష్ వైద్యుల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో నితీశ్ కుమార్ పాల్గొన్నారు. వేదికపై బురఖా ధరించిన ఓ ముస్లిం మహిళకు నియామకపత్రం అందజేస్తూ.. మొదట బురఖా తీయమని కోరారు. ఆ తర్వాత సీఎం నితీశ్ కుమార్ మహిళ ముఖం నుంచి బురఖా లాగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. సీఎం నితీశ్ కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
