
వరకట్న వేధింపులతో యువతి ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా పోతారం గ్రామంలో అదనపు వరకట్న వేధింపులు భరించలేక మను శ్రీ అలియాస్ సుప్రియ (23) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2023లో వివాహం జరిగిన సుప్రియను.. ఆమె భర్త సతీష్, తల్లిదండ్రులు, అన్న కలిసి మరో రూ.రెండు లక్షలు తీసుకురావాలని తరచుగా వేధించినట్లు సుప్రియ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పంచాయతీలో రాజీ కుదిరినా వేధింపులు కొనసాగాయని తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




