బిహార్ ఎన్నికలు.. తెలంగాణ స్ట్రాటజీ అమలుకు కాంగ్రెస్ ప్లాన్

10961చూసినవారు
బిహార్ ఎన్నికలు.. తెలంగాణ స్ట్రాటజీ అమలుకు కాంగ్రెస్ ప్లాన్
కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో విజయవంతంగా అమలు చేసిన ఎన్నికల వ్యూహాన్ని బిహార్‌లో కూడా అనుసరించాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో కాంగ్రెస్‌ 76 సీట్ల కోసం ఆర్జేడీతో పొత్తు ఏర్పరచే అవకాశముంది. ఈ నెల 24న పాట్నాలో అత్యున్నత విధాన నిర్ణయాక మండలి సమావేశంలో అగ్రనేతలు, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలు హాజరై ప్రణాళికను సమీక్షిస్తారు. 38 మంది అభ్యర్థుల తొలి జాబితా కూడా అదే రోజున ప్రకటించనున్నారు.

సంబంధిత పోస్ట్