
సీనియర్లకు లోయర్ బెర్త్.. TTE చెప్పిన సులభమైన ట్రిక్!
దూర ప్రాంతాలకు ప్రయాణించే సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీలు, వికలాంగులకు రైళ్లలో లోయర్ బెర్తులు లభించేలా భారతీయ రైల్వేలు కొత్త నియమాలను ప్రవేశపెట్టాయి. బుకింగ్ సమయంలో దిగువ బెర్త్ అందుబాటులో ఉంటేనే బుక్ చేసుకునేలా IRCTCలో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. టికెట్ బుకింగ్ సమయంలో గరిష్టంగా ఇద్దరు సీనియర్ సిటిజన్లు కలిసి టికెట్లు బుక్ చేసుకుంటే లోయర్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని TTE ఒకరు తెలిపారు.




