రెండో దశ పోలింగ్‌కు బిహార్‌ సిద్ధం

0చూసినవారు
రెండో దశ పోలింగ్‌కు బిహార్‌ సిద్ధం
బిహార్‌లో రెండో దశ పోలింగ్ మంగళవారం జరగనుంది. 122 అసెంబ్లీ స్థానాల్లో 1,302 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. నీతీశ్‌ సర్కారులోని పలువురు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ దశలో దాదాపు 3.70 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. 45 వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 40 వేల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పాలక ఎన్డీయే, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటములకు ఈ పోలింగ్ కీలక పరీక్షగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Job Suitcase

Jobs near you