డ్రైనేజిలో పడిపోయిన బైక్ (వీడియో)

15చూసినవారు
ఉత్తర్ ప్రదేశ్ లోని హాపూర్‌ లో ఓ బైక్ డ్రైనేజిలో పడిపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఓ కుటుంబం బైక్ పై వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ లో ఆగారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి డ్రైనేజిలో పడిపోయింది. బైక్ పై ఉన్న చిన్నారి, ఓ మహిళ, బైక్ నడిపిన వ్యక్తి పూర్తిగా మురుగునీటిలో పడిపోయారు. వెంటనే స్థానికులు గమనించి వారిని బయటకు తీశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్