ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న బైక్.. రైల్వే ఉద్యోగి స్పాట్ డెడ్

15చూసినవారు
ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న బైక్.. రైల్వే ఉద్యోగి స్పాట్ డెడ్
TG: ఆగి ఉన్న టిప్పర్‌ను బైక్ ఢీకొనడంతో రైల్వే ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా జామాండ్లపల్లి గ్రామ శివారులో నేషనల్ హైవేపై బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పీరాల భగవత్(30) డోర్నకల్ రైల్వే జంక్షన్ లో క్యారేజ్ అండ్ వాగన్(C&W) సెక్షన్ లో జూనియర్ ఇంజనీరింగ్ గా పని చేస్తున్నాడు. తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నీ బావికి స్కూటీపై వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్