మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తహరాబాద్-సతానా రహదారిపై వనోలి గ్రామం వద్ద బైక్ RTC బస్సును ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గోవింద్ కాలు పవార్, వికాస్ జైరామ్ మాలి, రోషన్ దయారామ్ మాలి అని గుర్తించారు. బైక్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.