అమ్మాయిల ముందు బైక్‌తో విన్యాసాలు చేయబోయి అభాసుపాలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెట్రోల్ బంకులో ఫ్యామిలీతో ఉన్న యువతిని చూసి యువకులు స్టంట్స్ చేయబోయి అదుపు తప్పి ముందున్న బైక్‌ను ఢీకొట్టారు. దీంతో ఆగ్రహించిన సదరు బైకర్ యువకుడికి చెంపదెబ్బతో బుద్ధి చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ కాగా.. 'షో చేయబోతే పరువు పోయింది'గా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.