కేరళలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన సమయంలో, ప్రొటోకాల్ భద్రత ఉల్లంఘించిన కొందరు యువకులు రోడ్డుపై బైక్ స్టంట్లు చేశారు. దీంతో పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకొని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసి, వీఐపీ ప్రొటోకాల్‌లు, రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించకూడదని కేరళ పోలీసులు హెచ్చరించారు.