AP: కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేశ్ (20) అనే యువకుడు బైక్‌పై వేగంగా వెళ్తున్నాడు. టర్నింగ్ వద్ద బైక్ అదుపుతప్పింది. దాంతో రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు పైనుంచి బైక్‌తో సహా యువకుడు గాల్లో ఎగిరిపడ్డాడు. రాజేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేశ్ మృతి చెందాడు.