బాలుడిని ఢీకొట్టిన బైకర్ (వీడియో)

18చూసినవారు
పంజాబ్‌లోని ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు దిగి తన ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న ఒక బాలుడిని అతివేగంతో వచ్చిన మోటార్ సైకిల్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో బాలుడు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. మోటార్ సైకిల్ స్వారీ చేస్తున్న వ్యక్తి నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్