వాటర్ ట్యాంకర్‌‌ను ఢీకొట్టిన బైకర్.. ఇద్దరు మృతి (వీడియో)

28చూసినవారు
AP: కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నోగిరాల వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం, వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మృతులు వల్లూరు పాలెం గ్రామానికి చెందిన వెంకట్, తెన్నేరు గ్రామానికి చెందిన మానికొండ పృథ్వితేజగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :