రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహీంద్రా థార్ వాహనం ఒక స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకర్ గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దృశ్యం మొత్తం అక్కడి సీసీటీవీలో రికార్డ్ అయింది. ప్రమాదం జరిగిన తర్వాత థార్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. పోలీసులు థార్‌ను జప్తు చేసి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.