నేడు అసెంబ్లీలో వృద్ధ తల్లిదండ్రులకు భరోసా బిల్లు

33చూసినవారు
నేడు అసెంబ్లీలో వృద్ధ తల్లిదండ్రులకు భరోసా బిల్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వృద్ధ తల్లిదండ్రుల రక్షణ కోసం 'TEAMPS' బిల్లును నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ప్రకారం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతం నుంచి 15% లేదా ₹10 వేల వరకు కోత విధించి, ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందించనున్నారు. మంత్రి లక్ష్మణ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెడతారు. దీంతో పాటు, మంత్రి సీతక్క 'పంచాయతీరాజ్ బిల్లు-2026'ను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2025-26 సవరణ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు.

సంబంధిత పోస్ట్