
మద్యం వినియోగంలో ప్రపంచంలో భారత్ 111వ స్థానం
ఇటీవలి కాలంలో మద్యం వినియోగం పెరిగింది. అత్యధిక వినియోగంతో ప్రభుత్వాలకు ఆదాయం వస్తున్నా, ఆరోగ్య, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయి. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డేటా ప్రకారం, కుక్ దీవులు, లాట్వియా, చెకియా, లిథువేనియా, ఆస్ట్రియా దేశాలు అత్యధిక మద్యం వినియోగంలో ముందున్నాయి. 189 దేశాల జాబితాలో భారత్ 111వ స్థానంలో ఉంది. WHO ప్రకారం, మద్యపానం వల్ల ఏటా 3 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి. అవగాహన కార్యక్రమాలతో ప్రభుత్వం మద్యం నియంత్రించాల్సిన అవసరముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.




