కొంతకాలంగా తగ్గిన బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపిస్తోంది. కేరళలో బర్డ్ ఫ్లూ (అవైన్ ఇన్‌ఫ్లుయెంజా) మళ్లీ కలకలం రేపుతోంది. అలప్పుళ, కొట్టాయం జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తిని అధికారులు గుర్తించారు. దీనితో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం వైరస్ కట్టడికి తక్షణ చర్యలు చేపట్టింది. ఈ వైరస్ పొరుగు రాష్ట్రాలకు వ్యాపించకుండా ఉండేందుకు తమిళనాడు ప్రభుత్వం కేరళ సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిఘాను మరింత కఠినతరం చేసింది. కోళ్ల వ్యాన్‌లను వెటర్నరీ బృందాలు తనిఖీ చేస్తున్నాయి.