అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిన H5N5 వైరస్

24864చూసినవారు
అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం.. మనిషికి సోకిన H5N5 వైరస్
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో H5N5 రకం ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) వైరస్ ఒక వ్యక్తికి సోకినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రపంచంలో ఈ వైరస్ మానవులకు సోకడం ఇదే మొదటి కేసు. నవంబర్ ప్రారంభంలో లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వృద్ధుడికి ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. పెంపుడు కోళ్లు, ఇతర పక్షుల మిశ్రమ గుంపును పెంచుకుంటున్న ఈ వ్యక్తికి అడవి పక్షుల ద్వారా వైరస్ సంక్రమించి ఉండవచ్చని భావిస్తున్నారు. జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

సంబంధిత పోస్ట్