గాల్లో ఉండగా విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తప్పిన పెను ప్రమాదం

7469చూసినవారు
గాల్లో ఉండగా విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తప్పిన పెను ప్రమాదం
ముంబై నుంచి డెహ్రాడూన్‌కు వెళ్తున్న ఇండిగో 6E5032 విమానాన్ని గాల్లోనే ఒక పక్షి ఢీకొట్టింది. ఆదివారం సాయంత్రం 6:45 గంటలకు డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో విమానం ముక్కు భాగం దెబ్బతిన్నప్పటికీ, 186 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్