
తాలిబన్ మంత్రి మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్టుల బహిష్కరణ
ఢిల్లీలో తాలిబన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాకి ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష నేతలు ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా, కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించారు. మంత్రి జైశంకర్‌తో చర్చలు జరిపిన అనంతరం ఆఫ్ఘన్ ఎంబసీలో జరిగిన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.




