భారత ఆర్మీకి బిట్స్‌ హైదరాబాద్‌ విద్యార్థుల డ్రోన్లు

32చూసినవారు
భారత ఆర్మీకి బిట్స్‌ హైదరాబాద్‌ విద్యార్థుల డ్రోన్లు
భారత సైన్యాన్ని వ్యూహాత్మకంగా బలోపేతం చేసేలా బిట్స్‌ హైదరాబాద్‌ విద్యార్థులు నమన్‌ కస్లివాల్, శివ్‌పాటిల్‌ అత్యాధునిక డ్రోన్లను రూపొందించారు. ‘బీజన్‌’ అంకుర సంస్థ ద్వారా అభివృద్ధి చేసిన వీటిని బిట్స్‌లోని కోరస్‌ ల్యాబ్‌లో పరీక్షించి, సికింద్రాబాద్‌, లేహ్‌ సహా పలు సైనిక కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. జీపీఎస్‌ లేకుండానే గమ్యాన్ని చేరేలా రూపొందించిన డ్రోన్లను ఇటీవల ఆర్మీ సదరన్‌ కమాండ్‌లో ప్రదర్శించగా.. మరో ఎనిమిది మిలిటరీ యూనిట్లు కూడా వీటిపై ఆసక్తి చూపాయి. స్వదేశీ సాంకేతికత, కృత్రిమ మేధతో వీటిని అభివృద్ధి చేశారు.

సంబంధిత పోస్ట్