గుజరాత్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ దూకుడు

5371చూసినవారు
గుజరాత్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ దూకుడు
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా, పంచాయతీలలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఏప్రిల్ 26, 27 తేదీలలో జరిగిన ఎన్నికల్లో 66% ఓటింగ్ నమోదైంది. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ వంటి ప్రధాన కార్పొరేషన్లలో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సాధించింది. కొత్తగా ఏర్పడిన మెహసానా, మోర్బి, నడియాడ్, వాపిలలో కూడా బీజేపీ విజయాలు సాధించగా, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 15 కార్పొరేషన్లలోని 1,044 సీట్లలో బీజేపీ 718 సీట్లలో ఆధిక్యంలో ఉంది.

సంబంధిత పోస్ట్