బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

34చూసినవారు
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం యూసుఫ్ గూడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై పీసీసీ చీఫ్ తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ సాయంతో బీజేపీ గెలిచిందని, ఆ రుణాన్ని తీర్చుకోవడానికే జూబ్లీహిల్స్ ఎన్నికలో బీజేపీ డమ్మీ అభ్యర్థిని పెట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఫేక్ హామీలతో మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని అన్నారు.