తెలంగాణలో మూడు జిల్లాలకు అధ్యక్షులను
బీజేపీ ప్రకటించింది. కరీంనగర్ జిల్లా
బీజేపీ అధ్యక్షుడిగా సాయి మల్లేశం,
వికారాబాద్‌కు యూ.రమేశ్, మేడ్చల్(అర్బన్)
బీజేపీ అధ్యక్షుడిగా గిరివర్ధన్‌రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నియమించారు. ఈటల, బండి సంజయ్ మధ్య విభేదాలతో ఇప్పటి వరకు 3 జిల్లాల అధ్యక్షుల నియామకం పెండింగ్‌లో ఉంచారు. తాజాగా వారిద్దరి మధ్య సయోధ్య కుదరడంతో పేర్లు ప్రకటించారు.