
నా కూతురిలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించి ఉండొచ్చు
బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ తన కుమార్తె రషా తడానీలో ఒక లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించి ఉండవచ్చని అన్నారు. మూడు-నాలుగు నెలల వయసు నుంచే ఆమె ప్రత్యేకమైన హావభావాలు ప్రదర్శించేదని, అద్దంలో చూసుకుంటూ నటించేదని తెలిపారు. తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకోవడం, మొదటి చిత్రంతోనే బ్లాక్బస్టర్ హిట్ సాధించడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. రషా త్వరలోనే తెలుగు ప్రేక్షకులనూ పలకరించేందుకు సిద్ధమవుతోంది.




