నాలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను మార్చుతూ BJP కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ
బీజేపీ అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రాను నియమించింది. హరియాణా రాష్ట్ర యూనిట్ అధ్యక్షురాలిగా డా. అర్చనా గుప్తాకు బాధ్యతలు అప్పగించగా, పంజాబ్ అధ్యక్షుడిగా కేవాల్ సింగ్ దిల్లాన్‌ను ఎంపిక చేసింది. త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా అభిషేక్ దేబ్రాయ్‌కు అవకాశం కల్పించింది. పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.