తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం అందించాలని బీజేపీ అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో శనివారం తహసీల్దార్ కార్యాలయం ముందు మండల బీజేపీ అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, తహసీల్దార్ అనుపమ రావుకు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంట నష్టాన్ని పట్టించుకోవడం లేదని, గతంలో సీఎం ప్రకటించిన పరిహారం కూడా అందలేదని ఆయన ఆరోపించారు.