ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఓట్ల కోసం మోదీ డ్యాన్స్ కూడా చేస్తారంటూ చేసిన కామెంట్లపై బిహార్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది. రాహుల్ వ్యాఖ్యలు అత్యంత అవమానకరమని, అత్యున్నత రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంది. ఇవి ప్రధాని వ్యక్తిత్వంపై దాడి చేయడమేనని మండిపడింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని, రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.