
జడ్చర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వను: ఎమ్మెల్యే అనిరుధ్
TG: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. పవన్ సినిమాలు తన నియోజకవర్గంలో ఆడనివ్వనని స్పష్టం చేశారు. తాను కూడా పవన్ అభిమానినేనని, కాని తెలంగాణ సెంటిమెంట్ ముఖ్యమన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో ఆయన సినిమాలు ఆడనివ్వొద్దన్నారు. ఏం మాట్లాడినా తెలంగాణ వాళ్లు ఏం చేయలేరని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.




