అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. పీపుల్స్ పల్స్ సర్వే అంచనా

11చూసినవారు
అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. పీపుల్స్ పల్స్ సర్వే అంచనా
అస్సాంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌ఈడీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. 126 స్థానాలున్న అసెంబ్లీలో మెజార్టీకి 64 అవసరం కాగా, బీజేపీకి 68-72, ఏజీపీకి 7-10, బీపీఎఫ్‌కు 8-9 స్థానాలు వస్తాయని, తద్వారా ఎన్‌ఈడీఏ 90 స్థానాలకు చేరుకుంటుందని సర్వే పేర్కొంది. బీజేపీ 38.6%, కాంగ్రెస్ 36.5% ఓట్లు పొందే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వానికి 45% మద్దతు లభిస్తుండగా, గౌరవ్ గొగాయ్‌కు 35% మద్దతు ఉంది. అప్పర్, మధ్య, లోయర్ అస్సాంలోనూ ఎన్‌డీఏ ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్