పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామి గురువారం గద్వాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో బీజేపీ పార్టీ అగ్రవర్ణాలకే వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. డీసీసీ అధ్యక్ష పదవి నియామకం కోసం నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల పర్యటన అనంతరం గద్వాలకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ అందరితో కలిసిపోయే పార్టీ అని, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఎన్నికల కమిషన్లు ఏకమై ఓటు చోరీ చేస్తున్నాయని ఆయన విమర్శించారు.