ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గునున్న టికెట్ ధరలు
Nov 05, 2026, 02:11 IST/

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గునున్న టికెట్ ధరలు

Nov 05, 2026, 02:11 IST
భారతీయ రైల్వే 2027 జనవరి 1 నుంచి ఉత్తర రైల్వే పరిధిలోని 18 రైళ్లకు సూపర్‌ఫాస్ట్ హోదాను తొలగించి, సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చనుంది. నిర్ణీత వేగాన్ని అందుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. దీనివల్ల ప్రయాణికులపై సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జీ భారం తగ్గుతుంది. అంతేకాకుండా, నైరుతి రైల్వేలోని కొన్ని రైళ్లతో సహా వీటన్నింటికీ కొత్త నంబర్లు కేటాయిస్తారు. ప్రయాణికులు జనవరి 1 నుంచి ప్రయాణించేటప్పుడు కొత్త నంబర్లు, ఛార్జీల వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా సరిచూసుకోవాలని సూచించారు.