ఉత్తరప్రదేశ్‌కు చెందిన
బీజేపీ ఎమ్మెల్యే చంద్రపాల్ సింగ్ లోధి ప్రయాణిస్తున్న ఫార్చూనర్ కారు గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం ప్రమాదానికి గురైంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా ముందు టైరు పేలిపోవడంతో కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యేను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.